1

1

Tuesday 28 April 2015

మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!

చిన్న విజ్ఞ‌ప్తి..
మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...!
స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!
***
తెలంగాణ‌లో ఎన్నో ప్రాజెక్టులు చేప‌డుతున్నారు.. కాంట్రాక్టుల‌న్నీ ఆంధ్రా కంపెనీల‌కు క‌ట్ట‌బెడుతున్నారు.. మ‌రి ఈ కంపెనీల‌న్నీ రాజ‌కీయప‌ర‌మైన విష‌యానికి వ‌స్తే అక్క‌డి ప్ర‌యోజ‌నాల కోస‌మే కొట్లాడేవి క‌దా.. తెలంగాణ ఉద్య‌మం 2009 డిసెంబ‌రు 9 త‌ర్వాత‌ దాదాపు నాలుగేళ్ల వ‌ర‌కూ విజ‌య‌తీరం చేయ‌కుండా అడ్డుకోవ‌డంలో వీరి పాత్ర ఉంది క‌దా... తెలంగాణ‌లో పెద్ద కాంట్రాక్ట‌ర్లు త‌క్కువ‌గా ఉన్నార‌న్న‌ది వాస్త‌వ‌మే.. మ‌రి కాంట్రాక్ట‌ర్ల‌ను త‌యారు చేయాలి క‌దా.. మ‌న వాళ్ల‌ను ఎప్ప‌టికీ స‌బ్ కాంట్రాక్ట‌ర్లుగానే ఉంచితే ఆంధ్రాపాల‌న‌కు మ‌న పాల‌న‌కు తేడా ఉండ‌దు క‌దా... ఎన్టీఆర్ అధికారం వ‌చ్చాకే ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మ‌రిన్ని ఎక్కువ అవ‌కాశాలు వ‌చ్చాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అలా వారి కులానికి, ప్రాంతానికి చెందిన వారికి అవ‌కాశాలు ఇవ్వ‌డం వ‌ల్లే ఆ పార్టీని ఇన్నేళ్లుగా వాళ్లు కాపాడుకోగ‌లిగారు.. మ‌రి రేపు టీఆర్ఎస్‌కు ఆర్థిక ప‌ర‌మైనా, ఇత‌ర‌త్రా ఇబ్బందులో వ‌స్తే ఇప్పుడు కాంట్రాక్టులు ద‌క్కించుకున్న వారు అండ‌గా ఉంటారంటారా?
ఏది ఏమైనా స‌రే తెలంగాణ‌లో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించాలి.. ఇప్పుడు ఆ ప‌ని చేయ‌క‌పోతే దీర్ఘ‌కాలంలో మ‌న‌కు న‌ష్టాన్ని మిగుల్చుతుంది.. !!

ప్ర‌తీ పుట్టిన రోజుకీ ఒక్కో మొక్క‌ను నాటితే... హ‌రిత తెలంగాణ సుసాధ్య‌మే..

తెలంగాణ జ‌నాభా దాదాపు 4 కోట్లు. ఏడాదిలో నాలుగు కోట్ల మంది పుట్టిన రోజు ఏదో ఒక రోజున‌ జ‌రుగుతుంది క‌దా.. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ త‌మ పుట్టిన రోజుకు ఒక్కో మొక్క‌ను నాటి.. దాన్ని సంర‌క్షిస్తే బాగుంటుంది... అలాగే తెలంగాణ‌ను సంద‌ర్శించే వీఐపీల‌తో ప్ర‌భుత్వం మొక్క‌లు నాటించాలి. గాంధీ జ‌యంతి, తెలంగాణ ఆవిర్భావం రోజున సామూహిక మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి.. ఎవ‌రు నాటిన మొక్క‌కు వారు బాధ్య‌త‌ను తీసుకునేలా ప్రోత్స‌హిస్తే హ‌రిత హారం విజ‌య‌వంతం అవుతుంది... అలా కాకుండా ప్ర‌భుత్వ‌మే 3 ల‌క్ష‌ల కోట్ల మొక్క‌లు నాటినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.. ప్రజా భాగ‌స్వామ్యాన్ని ఎంత పెంచితే అంత‌గా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు విజ‌య‌వంతంగా అమ‌ల‌వుతాయి..!!

Monday 27 April 2015

రాత్రికి రాత్రి క్రీడాకారుల అవ‌తారం ఎత్తారు..

వంద‌లాది చెరువులు క‌బ్జాకు గుర‌వుతున్న‌ప్పుడు ఒక్క‌రు కూడా ఆ క‌బ్జాకు గురైన చెరువుల్లో జెండాలు పాత‌లేదు.. కనీసం వాటిని కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.. ఇప్పుడు స‌ర్కారు ఏ నిర్ణ‌యం తీసుకున్నా అదెలా కుదురుతుంద‌ని వంక‌లు పెట్ట‌డం మాత్రం చేస్తున్నారు.. అస‌లు వీళ్లు ఎప్పుడైనా ఎన్టీఆర్ స్టేడియంలో ఆట‌లు ఆడారా? ఆడ‌లేదు.. ఇప్పుడేమో రాత్రికి రాత్రి క్రీడాకారుల అవ‌తారం ఎత్తి బ్యాట్ ప‌ట్టి ఆట‌లు ఆడుతున్నారు.. మ‌రి అదే ఎన్టీఆర్ స్టేడియాన్ని సంవ‌త్స‌రంలో 250 రోజుల పాటు హోమాల‌కు, పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు, రాజ‌కీయ స‌భ‌ల‌కు, బ‌హిరంగ స‌భ‌ల‌కు, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌కు ఇచ్చిన‌ప్పుడు ఈ ఆట‌లు గుర్తుకు రాలేదా?
అప్పుడు వీళ్లంతా ఎక్క‌డ‌ నిద్ర‌పోయారు... క్రీడా మైదానాన్ని ఇలా ఆధ్వాత్మిక హోమాలు, ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల పేరిట నాశ‌నం చేయొద్దు అని ప్ర‌శ్నించారా? ప్ర‌శ్నించ‌లేదు.. ప్ర‌శ్నించ‌రు కూడా... తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది కాబ‌ట్టి వ్య‌తిరేకించాలి అంతే.. ఇదే వీరి వైఖ‌రి...!!


వాళ్ల బాధంతా క్రికెట్ స్టేడియం గురించి కాదు... ఎన్టీఆర్ పేరును లేకుండా చేస్తున్నార‌నే.. ఒక‌వేళ క‌ళాభార‌తికి ఎన్టీఆర్ పేరు పెడ‌తామ‌ని అని ఉంటే ఈ పాటికి అహో.. ఒహో అంటూ కీర్తించేవారు...!!

కాఠ్‌మాండూ... అర్థం చేసుకోవ‌డానికి ఐదు నిమిషాలు ప‌ట్టింది...

కాఠ్‌మాండూ... అర్థం చేసుకోవ‌డానికి ఐదు నిమిషాలు ప‌ట్టింది... 
ఖాట్మండ్ పేరును ఈటీవీలో పై విధంగా మార్చేశారు... ఒక రోజు పేప‌ర్‌లో పేరు మార్చుతున్న న‌గ‌రాలు, వ్య‌క్తుల పేర్లు అని చెప్పి ఇస్తే పాఠ‌కులు, వీక్ష‌కులు అర్థం చేసుకుంటారు క‌దా...

ఆ రెండు హ‌త్య కేసుల‌ను పున‌ర్విచార‌ణ చేయించాలి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అయేషా మీరా కేసు, తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యూష కేసును మ‌ళ్లీ విచార‌ణ చేయిస్తే బాగుంటుంది... దేశ రాజ‌ధానిలో జ‌రిగిన నిర్భ‌య ఉదంతం త‌ర‌హా ఘ‌ట‌నే అయేషా మీరాది... మ‌రి నిర్భ‌య హంత‌కుల‌కు శిక్ష ప‌డింది.. మ‌రి అయేషా మీరా కేసులో నిజ‌మైన హంత‌కులు దొరికారా? ప్ర‌త్యూష కేసులోనూ అస‌లు హంత‌కుల‌కు శిక్ష ప‌డిందా? ఇవ‌న్నీ బ‌య‌ట‌కు రావాలి క‌దా...

ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు నిద్ర‌లేచి గ‌ర్జిస్తారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ఇచ్చే ఆలోచ‌న లేదు...: కేంద్రం
*************
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ఇచ్చే ఆలోచ‌న లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది... ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాగంటి బాబులు ఈ రోజు లోక్‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌ణాళిక శాఖ మంత్రి ఇంద‌ర్‌జిత్ సింగ్ ఈ విష‌యాన్ని చెప్పారు.. దీంతో ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిపై రెండు రాష్ట్రాలు పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు నిద్ర‌లేచి గ‌ర్జిస్తారా? నిద్ర న‌టిస్తారా? ఆ న‌ట కౌశ‌లాన్ని మ‌నం టీవీల్లో చూడాలి..

Friday 24 April 2015

ఎంఐఎం... ముస్లిం-ద‌ళిత ఐక్య‌త సిద్ధాంతం

ఔరంగాబాద్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎంఐఎం 25 స్థానాల‌తో రెండో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది...
ఇక్క‌డ మ‌రో విచిత్రం ఏంటంటే ఎంఐఎం రెబ‌ల్స్ మ‌రో 5 స్థానాల్లో గెలుపొందారు...
12 మంది ద‌ళితులు, ముస్లిమేత‌రుల‌ను ఎంఐఎం పోటీలో నిల‌ప‌గా.. వారిలో ఐదుగురు గెలిచారు..
ఈ ప‌రిణామంపై శివ‌సేన త‌న అధికారిక ప‌త్రిక సామ్నాలో తీవ్రంగా మండిప‌డింది..
ముస్లింల ప్ర‌యోజ‌నాలను కాపాడ‌టానికే పుట్టిన‌ ఎంఐఎం లాంటి పార్టీకి కొంద‌రు ద‌ళితులు, హిందువులు ఎలా మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కింది...
మ‌రి ముస్లింల‌కు ఓటు హ‌క్కు తొల‌గించాలంటూ మేం చేసిన వ్యాఖ్య‌లు కూడా మా కొంప ముచ్చాయ‌న్న ఆత్మ‌విమ‌ర్శ‌ను మాత్రం చేసుకోలేదు..
*****************
మాయావ‌తి ద‌ళిత‌-బ్రాహ్మ‌ణ సిద్ధాంతాన్ని వాడుకుని రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని చూస్తుంటే.. ఎంఐఎం ముస్లిం-ద‌ళిత ఐక్య‌త దిశ‌గా పావులు క‌దుపుతోంది... ఔరంగాబాద్ మాదిరిగా ఇత‌ర ప్రాంతాల్లోనూ ద‌ళితులు ఎంఐఎంలో ప్ర‌త్యామ్నాయాన్ని వెతుకుంటే అది ప్ర‌ధాన పార్టీల‌కు పెద్ద‌త‌ల‌నొప్పే అవ‌డం ఖాయం...

ఎంఐఎం నేత‌ల‌కు ఒక‌టే విజ్ఞ‌ప్తి.... ద‌య చేసి ప్ర‌జ‌లు మీపై ఉంచిన‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోండి...

ఇత‌ర పార్టీలు చేసే త‌ప్పుడు వాగ్దానాల‌తో జ‌నం విసిగిపోయారు.. వాళ్లు అన్ని వ‌ర్గాల స‌మాన జ‌నం అభివృద్ధిని కోరుకుంటున్నారు.. అందుకే ఎంఐఎంకు ఔరంగాబాద్‌లో ఆద‌ర‌ణ ల‌భించింది.. ప్ర‌జాబ‌లం ముందు ధ‌న బ‌లం ప‌నికి రాద‌ని మ‌రోమారు రుజువైంది...*** 
-ఔరంగాబాద్ ఫ‌లితాల‌పై ఓ ఎంఐఎం నాయ‌కుడి వ్యాఖ్య‌... 
******************
ఎంఐఎం నేత‌ల‌కు ఒక‌టే విజ్ఞ‌ప్తి.... ద‌య చేసి ప్ర‌జ‌లు మీపై ఉంచిన‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోండి... ఔరంగాబాద్‌ను హైద‌రాబాద్‌ ఓల్డ్ సిటీగా మార్చొద్దు... పాపం ఔరంగాబాద్‌ ప్ర‌జ‌లు ఓల్డ్ సిటీ అభివృద్ధిని చూడ‌కుండానే మీపై న‌మ్మ‌కం పెట్టుకున్నారు... ఔరంగాబాద్‌లో అల్ల‌ర్లు, ఆందోళ‌న‌లు లేకుండా, మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌కుండా కేవ‌లం అభివృద్ధిపై దృష్టి పెడితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మేయ‌ర్ పీఠం ద‌క్కుతుంది.. లేక‌పోతే మీ అస్తిత్వానికి ముప్పు త‌ప్ప‌దు...!!

Thursday 23 April 2015

ఆన‌వాయితీని పాటించిన మోడీ...

****************
వార్షిక ఉర్సు సంద‌ర్భంగా ఆజ్మీర్ ద‌ర్గాకు ప్ర‌ధాని మోడీ  చాద‌ర్..
ప్ర‌ధాని త‌ర‌ఫున వెళ్లి బుధ‌వారం చాద‌ర్ స‌మ‌ర్పించిన కేంద్ర మంత్రి న‌ఖ్వీ..
ప్ర‌పంచ శాంతి, సామాజిక సామ‌ర‌స్య‌త‌ను ఆకాంక్షించిన ప్ర‌ధాని..
ఖ్వాజా మొహీనుద్దీన్ చిస్తీ బోధ‌న‌లు ఇప్ప‌టికీ ఆచ‌ర‌ణీయ‌మ‌న్న మోడీ...
భార‌త్ ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి దేశంగా మారాల‌ని... అభివృద్ధి ఫ‌లాలు అన్ని వ‌ర్గాల‌కు అందాల‌ని ఆకాంక్షించారు...

మ‌హారాష్ట్ర‌లో పాగా వేస్తున్న ఎంఐఎం..

ఔరంగాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో 22 డివిజ‌న్ల‌లో గెలిచింద‌ట‌... బీజేపీ-సేన కూట‌మి 54 చోట్ల గెలుపొందింద‌ట‌... ఏందిది... హైద‌రాబాద్‌లో ఎంఐఎంను ఖ‌తం చేస్తామ‌న్నారు.. మ‌రి అక్క‌డ ఎలా ఎదుగుతోంది....

మ‌మ్మూటీ కుటుంబంలో చిచ్చు పెట్టేలా రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్లు...

ఈ రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ల‌ను చూస్తుంటే మ‌మ్మూటీ కుటుంబంలో చిచ్చు పెట్టేలాగే ఉన్నాడు...
ఏదో పుత్రోత్సాహంతో ముమ్మూటీ ఖుషీగా ఉంటే.. ఈ వ‌ర్మ ఓకే బంగారం.. ఓకే అని స‌ర్టిఫికేట్ ఇచ్చి ఊరుకుంటే స‌రిపోతుంది క‌దా..
మీ అయ్య క‌న్నా నువ్వు వెయ్యిపాళ్లు న‌యం.. నీ ముందు మీ అయ్య జూనియ‌ర్ ఆర్టిస్టు అన‌డం... అస‌లు మ‌మ్మూటీకి ఇచ్చిన అవార్డుల‌ను వెన‌క్కి తీసుకొని ఆయ‌న కొడుకుకు ఇవ్వాలంటూ రాసుకొచ్చాడు..
పాపం మ‌మ్మూటీ కొడుకు ఈయన ట్వీట్ల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని చూశాడు... ప‌ది జ‌న్మ‌లెత్తినా మా అయ్య న‌ట కౌశ‌లంలో మిలియ‌నో వంతును కూడా చేరుకోలేన‌న్న‌ట్లు చెప్పాడు...
పోనీలే అక్క‌డితో చ‌ర్చ‌ను ఆపితే ఆయ‌న రాంగోపాల్ వ‌ర్మ ఎందుకు అవుతాడు అన్న‌ట్లుగా.... తండ్రి ప్రేమ వ‌ల్ల నీ క‌ళ్లు మ‌బ్బులు క‌మ్ముకున్నాయి.. నీ తండ్రి క‌న్నా నువ్వు మిలియ‌న్ రెట్లు గ్రేట్ అంటూ రాసుకొచ్చాడు...
*************
ఎంత మ‌మ్మూటీ కొడుకు న‌ట‌న న‌చ్చితే మాత్రం ఇంత‌గా ట్వీట్లు రాయ‌డ‌మెందుకు.... ర‌క్త చ‌రిత్ర‌-3, శ్రీ‌దేవి, భూదేవి, భూతం, ప్రేతం అంటూ సినిమాలు మొద‌లు పెట్టి హీరోగా అవ‌కాశం ఇవ్వొచ్చుగా క‌దా.....
****************

ఎన్నేళ్ల‌కు ఎన్నేళ్ల‌కు... గ్యాస్ స‌బ్సిడీ వ‌దులుకున్న అనీల్ అంబానీ..

అనీల్ అంబానీ గ్యాస్ స‌బ్సిడీ వ‌దులుకున్నాడ‌ట‌... అరుణ్ జైట్లీ, వెంక‌య్య‌నాయుడులు గ్యాస్ స‌బ్సిడీల‌ను వ‌దులుకున్నార‌ట‌...
ఇది చాలా గొప్ప విష‌యం... నేనూ వాళ్ల స్థాయికి చేరుకున్న త‌ర్వాత‌ నేను నా గ్యాస్ స‌బ్సిడీని స్వ‌చ్ఛందంగా వ‌దులుకుంటానోచ్‌... నేను అంత సంప‌న్న శ్రేణిలో చేర‌లేదు.. బిలియ‌నీర్ మాట‌ను అటుంచితే క‌నీసం ల‌క్షాధికారిని కూడా కాలేదు...!!

Monday 20 April 2015

ప‌రాయి వాడు మ‌న గురించి చెడుగా చెప్పొద్దు.. కానీ మ‌నం విదేశాల‌కు వెళ్లి ఏ విధంగానైనా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు...!!

భార‌త్‌లో జ‌రిగిన నిర్భ‌య‌ ఘ‌ట‌న‌పై బీబీసీ వాళ్లు తీసిన డాక్యుమెంట‌రీ దేశ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చుతుంద‌ని భావించి దానిపై నిషేధాలు విధించారు.. కానీ భార‌త దేశమంటే అవినీతి అన్న‌ట్లు, ఇక్క‌డ అస‌లు ఉద్యోగులు ప‌నే చేయ‌రు అన్న‌ట్లు రాజ‌కీయ నేత‌లు దేశ దేశ‌మూ తిరిగి ప్ర‌చారం చేసినా త‌ప్పుండ‌దు.. అంతే క‌దా... ప‌రాయి వాడు మ‌న గురించి చెడుగా చెప్పొద్దు.. కానీ మ‌నం విదేశాల‌కు వెళ్లి ఏ విధంగానైనా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు...!!

నేను విదేశీ యాత్ర చేయాల‌నుకుంటున్నా...మ‌న దేశం గురించి ఏం చెప్ప‌మంటారు.?

నేను విదేశీ యాత్ర చేయాల‌నుకుంటున్నా...
******************
విదేశాల్లో మీ దేశం గురించి చెప్ప‌మంటే...
మా దేశంలో అస‌మాన‌త‌లు ఉన్నాయి.. అంట‌రానిత‌నం ఉంది... కులాల కుమ్ములాట ఉంది.. మ‌తాల మార‌ణ‌హోమం ఉంది అని చెప్పాల‌నుకుంటున్నా... ముస్లింల‌కు ఓటు హ‌క్కు ఉండ‌ద‌ని చెప్పే వ్య‌క్తులున్నార‌ని... ముస్లింల‌కు బ‌ల‌వంతంగా కుటుంబ నియంత్ర‌ణ చేయించాల‌ని ప‌ట్టుప‌ట్టే రాజ‌కీయ నేత‌లు ఉన్నార‌ని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌ద‌ల‌చుకున్నా... ద‌ళితుల‌కు దేవాల‌యాల్లోకి అనుమ‌తించ‌ని ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికీ న‌డుస్తున్నాయ‌ని..
నిర్భ‌య ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్య‌మ‌ని చాటింపు వేసి చెప్పాల‌నుకుంటున్నా... ఇంకేమ‌న్నా చెప్ప‌మంటారా?
*****************

భార‌త్‌లో ఇద్ద‌రు ప్ర‌ధానులున్నారా?

నెక్ట్స్ మ‌న బాబు గారి ప‌య‌నం... ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, కెన‌డానేమో...!!
పాపం ఆ దేశాధినేత‌లు ఆశ్చ‌ర్య‌పోతారేమో.. భార‌త్‌లో ఇద్ద‌రు ప్ర‌ధానులున్నారా?  అని ముక్కున వేలేసుకుంటారేమో...

మ‌ళ్లీ భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న మోడీ...

జ‌స్ట్ ఫ‌ర్ ఫ‌న్‌...
ఓ ఫేసుబుక్ మిత్రుడి పోస్టుకు తెలుగు అనువాదం.. 
భార‌త్‌లో మ‌రోమారు ప‌ర్య‌టిస్తున్న న‌రేంద్ర మోడీ... భార‌త ప్ర‌జ‌ల‌తో సంబంధాల‌ను ప‌టిష్ఠం చేసుకునేందుకు గ‌త 10 నెల‌ల కాలంలో ఆరోసారి భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న న‌రేంద్ర మోడీ అని సెల‌విచ్చాడు.. ప్ర‌పంచంలో భార‌త్‌కు ఉన్న ప్రాధాన్యానికి ఈ ప‌ర్య‌ట‌నే గొప్ప తార్కాణం అని విదేశాంగ శాఖ ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ట్లు కొస‌మెరుపు జోడించాడు..... !!

ఆంధ్రాకు నీళ్లు కావాలి.. తెలంగాణ ఎడారి కావాలి.. ఇదే ఆయ‌న మ‌నోగ‌తం..

జూరాల‌-పాకాల అంటే కేసీఆర్‌ను పాత‌రేస్తాడు... చంద్ర‌బాబు పోల‌వ‌రం క‌డితే జై కొడ‌తాడు... ఆంధ్రాకు నీళ్లు కావాలి.. తెలంగాణ ఎడారి కావాలి.. ఇదే రేవంత్ రెడ్డి గారి మ‌నోగ‌తం కావొచ్చు...

Thursday 16 April 2015

కాశ్మీర్‌లో పాకిస్థాన్ జెండా రెప‌రెప‌లు.. బీజేపీ ఏం చేస్తోంది...

జ‌మ్మూకాశ్మీర్లో పీడీపీ- బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌రుడుగ‌ట్టిన వేర్పాటు వాది ఆలంను విడుద‌ల చేశారు.. ఇప్పుడేమో ఆ వేర్పాటు వాది జ‌మ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ జెండాను ఎగ‌ర‌వేశాడు... భారీ ర్యాలీ తీశాడు... ఇప్ప‌టికీ వారిని అరెస్టు చేయ‌లేదు.. ఈ ప‌రిస్థితికి పీడీపీ కార‌ణ‌మ‌ని ఒక‌వేళ బీజేపీ భావిస్తే మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు క‌దా...!! మంత్రులు ప‌ద‌వుల‌కు రాజీనామా చేయొచ్చు క‌దా...!!!http://timesofindia.indiatimes.com/…/articlesh…/46938231.cms

కేసీఆర్ ఫొటోతో పాలిటెక్నిక్ హాల్‌టికెట్...

http://eenadu.net/news/newsitem.aspx?item=hyd-news&no=40

వైజాగ్‌లో చిత్రం....
కేసీఆర్ ఫొటోతో పాలిటెక్నిక్ హాల్‌టికెట్...
హాల్ టికెట్ జారీ చేసిన విద్యా శాఖ అధికారులు...

Monday 13 April 2015

తెలంగాణ ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌..

సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా.. ఇద్ద‌రూ తెలంగాణ వాళ్లే.. ఇద్ద‌రూ దేశం గ‌ర్వించే స్థాయికి ఎదిగారు... వారి వారి క్రీడల్లో అత్య‌త్త‌మ స్థానాల‌కు చేరుకున్నారు.. వీరే స్ఫూర్తిగా మ‌న‌మూ మ‌న తెలంగాణ‌ను అత్యుత్త‌మ స్థానంలో నిల‌పాలి.. సంఘ‌టితంగా ప‌నిచేస్తే అది సాధ్యం..!!

రాజ‌గురువు స‌చివాల‌యంకు వ‌చ్చి కేసీఆర్‌ను క‌లిశాడంటా..

రాజ‌గురువు స‌చివాల‌యంకు వ‌చ్చి కేసీఆర్‌ను క‌లిశాడంటా.. నిజ‌మేనా..
కొంప దీసి మొన్న ఈనాడు బాధిత ఉద్యోగుల ధ‌ర్నాకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చినందుకే ఆయ‌న వ‌చ్చారా?
ఇంకేమ‌న్నా మ‌త‌ల‌బు ఉందా?
కోట బ‌య‌ట‌కు రాని పెద్ద మ‌నిషి స‌చివాల‌యానికి వ‌చ్చాడ‌ని వార్త వింటే ఆశ్చ‌ర్యం వేస్తోంది..

మ‌హిళా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి క‌న్నీళ్లు కార్చ‌డం లేదు క‌దా..!!

మ‌న మ‌తం, కులం అన్నీ తెలంగాణే అన్న న‌మ్మ‌కాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల్సిన వాళ్లే.. న‌న్ను అణ‌గ‌దొక్కార‌ని అంటున్నారు.. మ‌రి అణ‌గ‌దొక్కాక ఆ పార్టీలో ఉండ‌టం ఎందుకు? బ‌య‌ట‌కు వ‌చ్చి మీ స‌త్తా చాటండి... ఈ శ‌క్తిని ప్ర‌పంచానికి తెలియ‌జేయండి.. అలా చేయ‌లేన‌ప్పుడు పార్టీ సిద్ధాంతాల ప్ర‌కారం న‌డుచుకోండి... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారో అంచ‌నా వేసి ఆ పార్టీలోకి దూకండి... !
************************
మ‌రి మ‌హిళా మంత్రే లేదు క‌దా.. తెలంగాణ జ‌నాభాలో స‌గం ఉన్న మ‌హిళ‌లు ఎంత ఫీల్ కావాలి... పురుషులంతా క‌లిసి తొక్కేశార‌ని మ‌హిళా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి క‌న్నీళ్లు కార్చ‌డం లేదు క‌దా..!!

ఎలా అణ‌గ‌దొక్కారు..

స్వామి గౌడ్‌
బూర న‌ర్స‌య్యగౌడ్‌ 
ప‌ద్మారావుగౌడ్‌
శ్రీ‌నివాస్ గౌడ్‌
****************
అణ‌గదొక్కార‌నుకోవ‌చ్చా 

జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు ఇస్తే..

ఇప్ప‌టి వ‌ర‌కూ అసెంబ్లీలో అడుగు పెట్ట‌ని కులాలేంటి(ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీల‌న్నింటిలో క‌లిపి)?
జ‌నాభా దామాషా ప్ర‌కారం అన్ని కులాల‌కు పార్ల‌మెంట్‌, అసెంబ్లీ, పుర‌పాలికాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే బాగుంటుందేమో...
అవ‌కాశం ద‌క్కిన కులాల వారికే మ‌ళ్లీ అవ‌కాశాలు ద‌క్క‌డం కాకుండా రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో అన్ని కులాల‌కు ప్రాతినిధ్యం ద‌క్కేలా చూస్తే బాగుంటుందేమో..
అవ‌కాశం వ‌చ్చిన వాడు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తాడు.. మంత్రి ప‌ద‌వి ద‌క్కిన వాడు మంచి శాఖ ద‌క్క‌లేద‌ని మొత్తుకుంటాడు..
మ‌రి అవ‌కాశాలే ద‌క్క‌ని వారి ప‌రిస్థితి ఏంటి? ఆలోచించాలి...
అంబేద్క‌ర్ జ‌యంతి నేప‌థ్యంలో ఈ దిశ‌గా రాజ్యాంగాన్ని స‌వ‌రించే చ‌ర్చ చేస్తే...!!

Friday 10 April 2015

కార్మికుల‌ను తొల‌గించి కార్మిక చ‌ట్టాల గురించి మాట్లాడే ఈనాడు...


ఎన్నో ప‌త్రిక‌ల్లో తొల‌గించ‌బ‌డిన ఉద్యోగుల వార్త‌ల‌ను వేసుకునే ఈనాడు ప‌త్రిక ఈ వార్త‌ను వేసుకోలేదు..(వార్త పేప‌ర్‌లో వ‌చ్చింది, ఇంకా ఎందులో వ‌చ్చిందో తెలియ‌దు)
మ‌రి కార్మిక చ‌ట్టాల గురించి తెగ ఫోజులు కొడ‌తారెందుకో...!

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక షో తెలంగాణ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించే నిబంధ‌న తెస్తే..

హైద‌రాబాద్‌లోనూ ప్ర‌తీ సినిమా థియేట‌ర్‌లో మొద‌టి షోలో తెలంగాణ ద‌ర్శ‌కులు తీసే సినిమాలో, తెలంగాణ‌లో నిర్మాణం అయ్యే సినిమాల‌నే ప్ర‌ద‌ర్శించాల‌నే నిబంధ‌న పెడితే బాగుంటుంది క‌దా... అప్పుడు తెలంగాణ సినిమాల నిర్మాణం ఎక్కువ‌గా జ‌రుగుతుంది...
ఇక హైద‌రాబాద్ మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లోనూ తెలంగాణ వంట‌కాలైన స‌ర్వ‌పిండి లాంటి వాటిని ప్ర‌వేశ‌పెడితే ఎలా ఉంటుంది... పాప్ కార్న్ లాంటివి తినొద్ద‌ని ఆదేశాలు ఇస్తే?

ప్ర‌మాదంలో ఉన్న వారిని కాపాడ‌కుండా వీడియో తీసిన ఘ‌నులు..


ఈ మ‌ధ్య ప్ర‌తీ ఛానెల్‌లోనూ మీ ప‌క్క‌న ఏదైనా సంఘ‌ట‌న జ‌రుగుతుంటే మీరే సాక్షిగా ఉన్నారా... ఆ సంఘ‌ట‌న‌ను ప్ర‌పంచానికి తెల‌పాల‌నుకుంటున్నారా? అయితే ఆ సంఘ‌ట‌న‌ను చిత్రీక‌రించి మా వాట్స‌ఫ్ నెంబ‌రుకు పంపండి అంటూ పిలుపునిస్తున్నాయి... ప‌క్క‌న ప్ర‌మాదం జ‌రిగితే బాధితుల‌ను కాపాడండి.. పోలీసుల‌కు ఫోన్ చేయండి అని చెప్పడం మానేశాయి.. బ‌హుషా ఇలాంటి ఛానెళ్లే కేర‌ళాలో కూడా ఉండి ఉంటాయి.. అందుకే ఓ మ‌హిళ రైలు ప‌ట్టాల‌పై ప‌డిపోయినా ప‌క్క‌న ఉన్న వాళ్లు రైలు ఆమె మీద నుంచి వెళ్తున్న దృశ్యాల‌ను చిత్రీక‌రించార‌ట త‌ప్ప ఆమెను కాపాడ లేదు... 
నాకు తెలిసి మ‌న ద‌మ్మున్న ఛానెల్ కు ఆ దృశ్యాలు దొరికితే ఎక్స్‌క్లూజివ్ అని చెప్పి వేసుకుంటుంది... ఇదేం ర‌కం జ‌ర్న‌లిజ‌మో..!!

క‌ట్జూ కూడా డిక్లేర్ చేశాడు.. మీడియా అంటే ప్రెస్టిట్యూట్స్ అని...

మొత్తం మీద మెజారిటీ మీడియా వ్య‌క్తులు ప్రెస్టిట్యూట్స్ అని ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మ‌న్ జ‌స్టిస్ మార్కండేయ క‌ట్జూ తేల్చిచెప్పారు.. ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు మిన‌హా మెజారిటీ మీడియాలో ఉన్న వాళ్లంతా ఇదే కోవ‌కు చెందుతార‌ని ఆయ‌న అన్నారు... 
***************
కేసీఆర్ మీడియా వ్య‌క్తుల‌ను చిల్ల‌ర గాళ్లు అన్నందుకే పెద్ద ర‌భ‌స జ‌రిగింది.. ఒక‌వేళ కేసీఆరే మీడియాను ప్రెస్టిట్యూట్స్ అని ఉంటే ఏమ‌య్యేదో... ఈ క‌ట్జూ గారు పెద్ద విచార‌ణే జ‌రిపించే వారు క‌దా...!!

టీడీపీ లో ఉండి ఎన్ని త‌ప్పులు చేసినా ఆ ప‌త్రిక‌కు క‌నిపించ‌దు..

ఎమ్మెల్సీ స‌లీం టీడీపీలోనే ఉండి ఉంటే బాగుండేది... టీఆర్ఎస్‌లో చేర‌డంతో ఆయ‌న అక్ర‌మాల‌ను బ‌య‌ట‌కు తీస్తోంది ద‌మ్మున్న పేప‌ర్‌... విచిత్రం ఏంటంటే ఆయ‌న అధికార పార్టీలో చేరినా కూడా అధికారులు ఎలాంటి లాలూచీ ప‌డ‌కుండా ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.. అదే టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఇది జ‌రిగేదా? 
ఏది ఏమైనా త‌ప్పు చేసిన అత‌డిని శిక్షించాల్సిందే.. 
*************
ఇక మ‌రో విచిత్ర‌మైన వార్త ఏంటంటే మ‌ల్కాజిగిరి ఎంపీ మ‌ల్లారెడ్డి నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా త‌న ఫంక్ష‌న్ హాల్ కోసం సివ‌రేజ్ లైన్ వేసుకున్నాడు.. అదే ప‌నిని ఒక సామాన్యుడు చేసినందుకు రూ.20 వేల జ‌రిమానా, క్రిమిన‌ల్ కేసులు పెట్టేవారు.. మ‌రి ఆ పెద్ద మ‌నిషి చేస్తే ఎందుకు వ‌దిలేశారు?
మ‌రి దీనిపైన కూడా నిజంగా ఆయ‌న సివ‌రేజ్ లైన్ వేసుకున్నాడా? లేదా అన్న‌ది ద‌మ్మున్న పేప‌ర్ వెలికి తీయాల‌ని కోరుకుంటున్నా...

ఆస్తి ప‌న్ను వ‌సూలుకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

చూశారా చోద్యం...!!
బ‌ల‌వంత‌పు ఆస్తి ప‌న్ను వ‌సూలుకు వ్య‌తిరేకంగా ఈ రోజు హైద‌రాబాద్‌లో బీజేపీ ధ‌ర్నా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది....
ప‌న్నుల వ‌సూలుకు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేస్తున్న బీజేపీ వాళ్లు.. మ‌రి కేంద్రం విధించే ప‌న్నుల‌ను కూడా రాష్ట్రాలు ఎగ్గొడితే ఏం చేస్తాయి...? ముక్కు పిండి వ‌సూలు చేయ‌వా? కేంద్రం ఎలాంటి ప‌న్నులు వేసినా భ‌రించాలి కానీ... ప్ర‌జ‌లు క‌ట్టాల్సిన ఆస్తి ప‌న్నును వ‌సూలు చేస్తే త‌ప్ప‌వుతుందా? అందులోనూ బ‌కాయిలు ఉన్న వారికి వ‌డ్డీ మాఫీ అంటూ స్కీంలు పెట్టి మ‌రీ వ‌సూలు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకోవ‌డం ఏంటో?
రేపు మీ పార్టీ అధికారంలోకి వ‌స్తే ప‌న్నులు వేయ‌కుండా ఉంటుందా? ప‌న్నుల‌ను వ‌సూలు చేయ‌కుండా ఉంటుందా? ఈ రోజు రాసిస్తారా?

మ‌తానికి మార‌ణ హోమానికి సంబంధం లేదు..

1985లో ఎయిర్ ఇండియా క‌నిష్క విమానాన్ని పేల్చిన ఉగ్ర‌వాదులు ఎవ‌రు?
ఎంద‌రు చ‌నిపోయారు...
నాయుడ‌మ్మ అనే శాస్త్ర‌వేత్త కూడా చ‌నిపోయాడు క‌దా...
బ‌హుషా ప్ర‌పంచంలోనే మొద‌టి సారి భారీ జంబో విమానాన్ని పేల్చేసిన ఉగ్ర‌వాదులు ఎవ‌రు...
నోట్‌: ఈ దేశంలో ఉగ్ర‌వాదానికి ఒక మ‌త‌మే కార‌ణం అన్న భ్ర‌మ‌లో ఉన్న వారి కోసం మాత్ర‌మే...
ప్ర‌తీ మ‌తంలోనూ కొంద‌రు చెడ్డ వారు ఉంటారు. ఎక్కువ మంది మంచి వారు ఉంటారు... అది గుర్తించ‌క‌పోవ‌డం హ్ర‌స్వ దృష్టికి నిద‌ర్శ‌న‌మే...

Thursday 9 April 2015

మ‌న రాష్ట్రానికి మ‌నం అంబాసిడ‌ర్లం,

చెన్నైలో ఉన్న తెలంగాణ మిత్రులారా... మీరు ఎక్క‌డా కూడా తెలుగోళ్ల‌మ‌ని చెప్పుకోకండి.. తెలంగాణోళ్లం.. హైద‌రాబాదీలం అని చెప్పుకోండి... తెలుగోళ్లం అని అంటే.. ఆంధ్రాపై ఉన్న కోపాన్ని మొత్తం మీపైనే తీసినా తీస్తారు త‌మిళ తంబీలు...
*******************
ఈ ముచ్చ‌ట ఎందుకు చెబుతున్నానంటే.. మొన్నామ‌ధ్య ఢిల్లీకి పోయిన‌ప్పుడు ఓ మ్యూజియంలో ఒకాయ‌న క‌లిసిండు.. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రా అని అన్న‌డు... ఆంధ్రాలో ఎక్క‌డ అంటే వ‌రంగ‌ల్ అని చెప్పిండు.. అరె బై.. మ‌న తెలంగాణ వ‌చ్చి ఆరు నెల‌లు అయింది ఇంకా ఆంధ్రా అని ఎందుకు అంటున్నావు అంటే.. మిమ్మ‌ల్ని చూస్తే ఆంద్రా వారిలా అనిపించారు.. అందుకే అలా చెప్పాన‌న్నాడు.. నేను ఆంధ్రోడిని అనుకొని ఆంధ్రా చెబుతావా? ఈ మొహ‌మాటాలొద్దు ఎక్క‌డికి పోయినా.. ఎవ‌ర‌డిగినా స‌రే ధైర్యంగా ఆత్మ‌విశ్వాసంతో మాది తెలంగాణ అని చెప్పు అని చెప్పాను.. ఆయ‌న ఓకే అన్నా అంటూ వెళ్లిపోయాడు..
*******************
రాజ‌స్థాన్ పోయినా, ఢిల్లీ పోయినా, కాశ్మీర్ పోయినా, క‌న్యాకుమారి పోయినా స‌రే మ‌న రాష్ట్రానికి మ‌నం అంబాసిడ‌ర్లం, మ‌న‌మే మ‌న రాష్ట్ర పేరు, ప్ర‌తిష్ఠ‌ల‌ను నిల‌పాలి... జ‌నం నోళ్ల‌లో తెలంగాణం మార్మోగేలా చేయాలి...

ఇద్ద‌రి మ‌ధ్య దోస్తీకి ఏమైనా గండి ప‌డిందా?

బాబు గారికి జ‌య‌ల‌లిత గారికి మంచి దోస్తీ ఉంది క‌దా... జాతీయ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు క‌లిసి చ‌క్రం తిప్పిన నేత‌లు క‌దా.. మ‌రి ఆ దోస్తీ ఇప్పుడు ప‌నికి రావ‌డం లేదా? ఇద్ద‌రి మ‌ధ్య దోస్తీకి ఏమైనా గండి ప‌డిందా?

ఎన్‌కౌంట‌ర్ చిచ్చు ఆర్పేందుకు కేంద్రం రంగంలోకి దిగ‌లేదు ఎందుకు?

గుస గుస‌...
ఆంధ్రా, త‌మిళ‌నాడు మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ చిచ్చు మొద‌లైన త‌ర్వాత దాన్ని ఆర్పేందుకు కేంద్రం రంగంలోకి దిగ‌లేదు ఎందుకు? కొంప‌దీసి ఇటీవ‌ల కాలంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ అగ్ర‌నేత‌లే ల‌క్ష్యంగా టీడీపీ నేత‌లు విమ‌ర్శలు చేయ‌డ‌మే కార‌ణ‌మా? వెంక‌య్య‌, నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌పై టీడీపీ నేత‌లు విరుచుకు ప‌డ‌టం మ‌నం చూస్తున్నాం.. ఈ నేప‌థ్యంలో ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌తో త‌మిళ‌నాడు లో మొద‌లైన ఆందోళ‌న‌లు టీడీపీ స‌ర్కారు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంటే బీజేపీ నేత‌లు కావాల‌నే మౌనంగా ఉంటున్న‌రా? అన్న అనుమానం క‌లుగుతోంది.. ఒక‌వేళ ఈ సంక‌ట ప‌రిస్థితి నుంచి టీడీపీ స‌ర్కారు గ‌ట్టెక్కించినా స‌రే మ‌ళ్లా త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకునే విమ‌ర్శ‌లు చేయ‌ర‌నే గ్యారెంటీ లేద‌నే ఉద్దేశంతోనే వారు జోక్యం చేసుకోవ‌డం లేద‌నిపిస్తోంది...!!

రామ‌లింగ‌రాజు పెద్ద‌స్థాయిలో ఉంటే.. ఆయ‌న‌కు ఓన‌మాలు నేర్పిందే నేను అని చెప్పేవాడే క‌దా.. !

నోరు తెరిస్తే హైద‌రాబాద్ ను నేను అభివృద్ధి చేశాను... హైటెక్ సిటీ నాదే అని చెప్పుకునే మ‌న బాబు గారు.. స‌త్యం రామ‌లింగ‌రాజు నా దోస్తే నేనే ఆయ‌న‌నుఇండ‌స్ట్రీకి తెచ్చిన అని ఈ రోజు ఎక్క‌డైనా చెప్పాడా? లేక ఆయ‌నెవ‌రో నాకు తెల‌వ‌ద‌న్నాడా?
*****************
ఒక‌వేళ ఈ స‌మ‌యంలో రామ‌లింగ‌రాజు పెద్ద‌స్థాయిలో ఉంటే.. ఆయ‌న‌కు ఓన‌మాలు నేర్పిందే నేను అని చెప్పేవాడే క‌దా.. !

మావోయిస్టు నేత‌ల‌ను ఆరాధించే ప్ర‌జ‌లంద‌రూ తీవ్రవాదులే అనుకోవ‌చ్చా

ఈ దేశంలో న‌క్స‌లైట్లు మందుపాత‌ర‌ల ద్వారా పోలీసుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను ఎంద‌రినో చంపేశారు.. ప్ర‌జా కోర్టుల్లో కొంద‌రికి శిక్ష‌లు వేశారు.. అయినా స‌రే పోలీసుల ఎన్‌కౌంట‌ర్ల‌లో(బూట‌క‌మైన‌వో నిజ‌మైన‌వో) మావోయిస్టులు చ‌చ్చిపోతే వాళ్ల స్వ‌గ్రామాల్లో వీరులు చ‌నిపోయిన‌ట్లు ఊరేగిస్తారు... ప్ర‌జ‌ల క‌న్నీళ్లు పెట్టుకుంటారు.. పోలీసుల‌ను చంపే, రాజ‌కీయ నాయ‌కుల‌ను హ‌త‌మార్చే, టెలిఫోన్ ఎక్సైంజీలు, బిడ్జిల‌ను పేల్చే మావోయిస్టు నేత‌ల‌ను ఆరాధించే ప్ర‌జ‌లంద‌రూ తీవ్రవాదులే అనుకోవ‌చ్చా?

జాతిపిత‌నే హ‌త‌మార్చిన హంత‌కుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వాళ్లు ఉన్న దేశం ఇది...

* నాథూరాం గాడ్సేకు ఉరి శిక్ష విధించి త‌ర్వాత అంత్య‌క్రియలు నిర్వ‌హించినా హిందువులు పాల్గొని ఉంటారు.. పాల్గొన‌లేద‌ని చెప్ప‌లేం క‌దా... జాతిపిత‌నే హ‌త‌మార్చిన హంత‌కుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వాళ్లు ఉన్న దేశం ఇది...
నాథూరాం గాడ్సేకు ఉరి శిక్ష విధించి త‌ర్వాత అంత్య‌క్రియలు నిర్వ‌హించినా హిందువులు పాల్గొని ఉంటారు.. పాల్గొన‌లేద‌ని చెప్ప‌లేం క‌దా... జాతిపిత‌నే హ‌త‌మార్చిన హంత‌కుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వాళ్లు ఉన్న దేశం ఇది... 
* ఇందిరాగాంధీని చంపిన హంత‌కుల‌కు జేజేలు ప‌లికిన వాళ్లు ఉన్నారు.. ఇప్ప‌టికీ ఖ‌లిస్తాన్ అనుకూల ప్ర‌క‌ట‌న‌లు చేసే పంజాబ్ నేత‌లు ఉన్నారు...
* ప్ర‌భాక‌ర్ చ‌స్తే క‌న్నీళ్లు పెట్టుకున్న తమిళులు ఉన్నారు.. ఉగ్ర‌వాది ప్ర‌భాక‌రన్ కోసం కొట్లాడిని ముఖ్య‌మంత్రులు ఉన్నారు..
* రేపు సాధ్వీ ప్ర‌జ్ఞాసింగ్‌, అసీమానంద ఎన్‌కౌంట‌ర్ జ‌రిగితే హిందువులు పాల్గొన‌ర‌ని ఎవ‌రైనా రాసిస్తారా?
ఇవ‌న్నీ మార‌తాయా?


*************************
భార‌త జాతి పిత‌ను హ‌త‌మార్చిన‌ గాడ్సేకు గుడి క‌డుతున్నారు కొంద‌రు.. ఇలాంటి ప‌రిస్థితే ఉంటే రేపు ఉగ్ర‌వాదుల‌కూ గుడి క‌ట్ట‌ర‌నే గ్యారెంటీ ఏంటి?

మ‌రి కోర్టు వ్యాఖ్య‌లు స‌మంజ‌స‌మా? అస‌మంజ‌స‌మా? మీరే చెప్పాలి..

మొన్నా మ‌ధ్య వ‌రంగ‌ల్ లో ఓ అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన నిందితుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ పెట్టి త‌ర్వాత ఎన్‌కౌంట‌ర్ చేసిన ఘ‌ట‌న‌పై నెల క్రితం హైకోర్టు కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఎక్క‌డో చ‌దివాను.. అందులో నిందితులను మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టి దోషులుగా నిర్ధ‌రించి ఎలా ఎన్‌కౌంట‌ర్ చేసిన హీరోలు అనిపించుకోవాల‌ని అనుకుంటున్నారా? 
ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కావొద్దు అని ఘాటుగా హెచ్చ‌రించిన‌ట్లు చ‌దివాను.. మ‌రి కోర్టు వ్యాఖ్య‌లు స‌మంజ‌స‌మా? అస‌మంజ‌స‌మా? మీరే చెప్పాలి..http://www.firstpost.com/india/dont-parade-the-accused-hc-promises-ban-on-media-exposure-of-suspects-2152469.html

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉగ్ర‌వాది అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌జ‌లు ఎలా హాజ‌ర‌య్యారు..

మొన్న సూర్యాపేట కాల్పుల ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన ఉగ్ర‌వాది అంత్య‌క్రియ‌లు మొన్న భోపాల్‌లో జ‌రిగాయి.. పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించారు.. ప్ర‌జ‌లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉగ్ర‌వాది అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌జ‌లు ఎలా హాజ‌ర‌య్యారు... అక్క‌డ బీజేపీ స‌ర్కారు ఏం చేస్తోంది...!!

ఉగ్ర‌వాదుల అంతిమ యాత్ర‌ల్లో జ‌నాలెందుకు?

* నాథూరాం గాడ్సేకు ఉరి శిక్ష విధించి త‌ర్వాత అంత్య‌క్రియలు నిర్వ‌హించినా హిందువులు పాల్గొని ఉంటారు.. పాల్గొన‌లేద‌ని చెప్ప‌లేం క‌దా... జాతిపిత‌నే హ‌త‌మార్చిన హంత‌కుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వాళ్లు ఉన్న దేశం ఇది...
నాథూరాం గాడ్సేకు ఉరి శిక్ష విధించి త‌ర్వాత అంత్య‌క్రియలు నిర్వ‌హించినా హిందువులు పాల్గొని ఉంటారు.. పాల్గొన‌లేద‌ని చెప్ప‌లేం క‌దా... జాతిపిత‌నే హ‌త‌మార్చిన హంత‌కుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వాళ్లు ఉన్న దేశం ఇది... 
* ఇందిరాగాంధీని చంపిన హంత‌కుల‌కు జేజేలు ప‌లికిన వాళ్లు ఉన్నారు.. ఇప్ప‌టికీ ఖ‌లిస్తాన్ అనుకూల ప్ర‌క‌ట‌న‌లు చేసే పంజాబ్ నేత‌లు ఉన్నారు...
* ప్ర‌భాక‌ర్ చ‌స్తే క‌న్నీళ్లు పెట్టుకున్న తమిళులు ఉన్నారు.. ఉగ్ర‌వాది ప్ర‌భాక‌రన్ కోసం కొట్లాడిని ముఖ్య‌మంత్రులు ఉన్నారు..
* రేపు సాధ్వీ ప్ర‌జ్ఞాసింగ్‌, అసీమానంద ఎన్‌కౌంట‌ర్ జ‌రిగితే హిందువులు పాల్గొన‌ర‌ని ఎవ‌రైనా రాసిస్తారా?
ఇవ‌న్నీ మార‌తాయా?

Wednesday 8 April 2015

మీడియా అంటే... ప్రెస్టిట్యూట్స్( 'presstitutes'.) అంటా...

కేంద్ర మంత్రి వి.కె.సింగ్ దృష్టిలో మీడియా అంటే... ప్రెస్టిట్యూట్స్( 'presstitutes'.) అంటా... వారెవ్వా.. ఇప్పుడు ఎన్ని మీడియా సంఘాలు గొత్తెత్తుతాయో.. ఎన్ని ప్రెస్ కౌన్సిల్స్ ఖండిస్తాయో వేచిచూడాలి..

అత్త మీద కోపం దుత్త మీద తీశారా ఏంది?

ఎంత‌ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌పై కోపం ఉంటే మాత్రం... త‌మిళ కూలీల‌ను చంపి కోపాన్ని తీర్చుకుంటారా ఏంది?

ఇవ‌న్నీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డానికే చేశార‌నుకోవ‌చ్చేమో...!!

రెండేళ్ల క్రితం మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి త‌ప్పించుకు తిరుగుతున్న ఉగ్ర‌వాదుల‌ను 10 నెల‌ల్లో హ‌త‌మార్చిన తెలంగాణ‌..
స‌మైక్య రాష్ట్రంలో ఎన్నో ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన తెలంగాణ పోలీసులు.. 
ఇవ‌న్నీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డానికే చేశార‌నుకోవ‌చ్చేమో...!!

ప్ర‌జాహిత వ్యాజ్యాలు దాఖ‌లు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు...

వికారుద్దీన్ గ్యాంగ్‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తే ఒక్క పోలీసుకు కూడా గాయాలు కాలేదా? ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు ముగ్గురు పోలీసుల‌ను చంపిన‌ప్పుడు ఐదుగురు ఉగ్ర‌వాదులు ఒక్క పోలీసును కూడా గాయ‌ప‌ర‌చ‌లేదా? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌ల‌ను రేపు ఎవ‌రైనా ప‌త్రిక‌ల్లోనో, ప్ర‌జా సంఘాల వారో లేవ‌నెత్తుతారు... వీలైతే హైకోర్టులో ప్ర‌జాహిత వ్యాజ్యాలు దాఖ‌లు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు...

టీఆర్ఎస్ నేత‌లు భ‌ద్ర‌త పెట్టుకుంటే మంచిదేమో..

గ‌తంలో తెలంగాణ‌లో రాజ‌కీయ నాయ‌కులు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉండి హైద‌రాబాద్ కు వ‌చ్చి త‌ల‌దాచుకునే వారు..
ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌లు ఉగ్ర‌వాదుల హిట్ లిస్టులో చేరుతారేమో అన్న అనుమానం క‌లుగుతోంది.. ఎందుకైనా మంచిది బీజేపీ నేత‌ల మాదిరిగా జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త పెట్టుకుంటే మంచిది..

మ‌ల్లి మ‌స్తాన్ బాబుకు త‌గినంత‌ గుర్తింపు ద‌క్క‌లేదు ఎందుకో?

దేశంలో ఎవ‌రూ సాధించ‌లేని కీర్తిని సాధించిన తెలుగు తేజం మ‌ల్లి మ‌స్తాన్ బాబుకు ప‌ద్మ‌శ్రీ‌లు ఎందుకు ద‌క్క‌లేదు.. ఇలాంటి వారిని గుర్తించ‌రు ఎందుకో? ఇక్క‌డా కులం అడ్డా? ఇంకేమైనా అడ్డా నాకు అర్థం అవ‌డం లేదు.. ప‌నికి మాలిన వారికి ప‌ద్మ‌శ్రీ‌లు ఇచ్చే ప్ర‌భుత్వాలు ఇలాంటి వారికి ఎందుకు ఇవ్వ‌లేదు.. ఆయ‌న ఏ ప‌ర్వ‌తం అధిరోహించినా ఎగ‌రేసింది మ‌న జెండానే క‌దా.. మ‌నకు పేరు తెచ్చే ప‌నినే చేశాడు క‌దా.. మ‌రి త‌గినంత‌
గుర్తింపు ద‌క్క‌లేదు ఎందుకో?

ఛానెళ్ల క‌థ‌నాల ఆధారంగా హోంమంత్రి ప్ర‌క‌ట‌న‌లు చేయాలా?

సీఐ మొగిల‌య్య ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ గ్యాంగ్‌ల‌కు చెందిన ఇద్ద‌రిని అరెస్టు చేశారు.. వారు బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.. వారి నెట్ వ‌ర్కు కోసం గాలిస్తుండ‌గా వారి ముఠా స‌భ్యులే దాడి చేశారు అని ప్ర‌సారం చేసిన ఛానెళ్ల‌ను మ‌నం చూశాం.. ఒక రోజు వ్య‌వ‌ధిలో అవే ఛానెళ్లు వీళ్లు ఉగ్ర‌వాదుల‌న్నాయి...ఈ ఛానెళ్లు ఏమైనా అంటాయి.. వాటి ఆధారంగా ప్ర‌క‌ట‌న‌లు చేయాలా? లేక పోలీసులు చెప్పిన స‌మాచారం ప్ర‌కారం ప్ర‌క‌ట‌న‌లు చేయాలా?

ఇన్నోవాలు కొంటే త‌ప్ప‌న్నారు.. ఇప్పుడేమో సౌక‌ర్యాలు క‌ల్పించాలంటున్నారు..

పోలీసుల‌కు ఇన్నోవాలు కొంటే త‌ప్పు ప‌ట్టిన విప‌క్షాలు..
పోలీసు వ్య‌వ‌స్థ‌ను ఆధునికీక‌రిస్తుంటే డ‌బ్బు దుబారా అన్న నోళ్ల‌తోనే ఇప్పుడు పోలీసుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అంటుండ‌టం చూస్తుంటే న‌వ్వొస్తుంది..

ఆ న‌లుగురు వీరుల‌కు స‌లాం.. !

త‌మ వీర మ‌ర‌ణంతో పోలీసు విభాగం ప్ర‌తిష్ఠ‌ను ఎవ‌రెస్టు శిఖ‌రం అంత ఎత్తులో నిలిపిన ఆ న‌లుగురు వీరుల‌కు స‌లాం.. !
పోలీసు శాఖ‌కు క‌ళంకం తెచ్చిన పోలీసుల గురించే కాదు.. విధి నిర్వ‌హ‌ణ‌లో, స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో అసువులు బాసిన ఇలాంటి పోరాట యోధుల‌కు మీడియాలో ప్ర‌ముఖ స్థానం ల‌భించాలి...!!

మిత్రుడు శ‌త్రువుగా క‌నిపిస్తే ఇలాగే ఉంటుంది మ‌రి..

పాపం అప్ప‌ట్లో తెలంగాణ ఉద్య‌మాన్ని దెబ్బ తీయ‌డానికి గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారీ రాస‌లీల‌ల‌ను విడుద‌ల చేసిన ఛానెల్‌..
ఇప్పుడేమో గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ ను దెబ్బ‌తీయానికి టీ పార్టీలు అంటూ క‌థ‌నాలు అల్లుతోంది..
వీరికి అవ‌స‌రం ఉన్న‌న్ని రోజులు ఉగ్ర న‌ర‌సింహుడిగా క‌నిపించిన ఆయ‌న‌.. ఇప్పుడేమో... గులాబీ న‌రసింహుడిగా క‌నిపిస్తున్నాడు...
పాపం ఈ న‌రసింహుడికి రాస‌లీల‌ల వీడియోలు లేవు క‌దా అందుకే ఏదో యాగి చేస్తున్నాడు..
రేపు గుళ్లో ష‌ర్టు విప్పి పొర్లు దండాలు పెట్ట‌డాన్ని త‌ప్పుప‌డ‌తాడు.. ఇక సోమాజీగూడ ఆంజ‌నేయుని గుడికి వెళ్లి ద‌ర్శ‌నం స‌మ‌యంలో ట్రాఫిక్‌ను ఆపేసి జ‌నానికి ఇక్క‌ట్లు క‌లిగిస్తున్నాడ‌ని రాస్తాడు...
పాపం మిత్రుడు శ‌త్రువుగా క‌నిపిస్తే ఇలాగే ఉంటుంది మ‌రి..

అమ‌రావ‌తికి మోత్కుప‌ల్లిని తీసుకెళ్లండి.

న‌రసింహ‌న్ ఒక‌వైపు చూస్తున్నాడు క‌దా.. అందుకే మీ వైపు చూసే గ‌వ‌ర్న‌ర్‌ను మీ అమ‌రావ‌తిలో ప్ర‌తిష్ఠించుకోండి... తెలంగాణ‌కు న‌రసింహ‌న్‌, అమ‌రావ‌తికి మోత్కుప‌ల్లిని తీసుకెళ్లండి.. ఈ మేర‌కు విభ‌జ‌న చ‌ట్టాన్ని స‌వ‌ర‌ణ‌లు చేయించండి... ప‌నిలో ప‌ని మీకో హైకోర్టు కూడా కావాల‌ని ప‌ట్టుప‌ట్టండి...

Wednesday 1 April 2015

మీరు ఆల‌స్యం చేసిన‌న్ని రోజులు భారం పెరుగుతుంది...

ఈ ప‌న్నుల భారం త‌ప్పించుకోవాలంటే ఒక‌టే మార్గం..
వీలైనంత త్వ‌ర‌గా కొత్త రాజ‌ధాని నుంచి పాల‌న‌ను ప్రారంభిస్తే.. ప్ర‌జ‌లు హైద‌రాబాద్‌కు రావ‌డం త‌గ్గిస్తారు..
వారిపై ర‌వాణా ప‌న్ను భారం ఉండ‌దు.. మీరు ఆల‌స్యం చేసిన‌న్ని రోజులు భారం పెరుగుతుంది...

ఉమ్మ‌డి హైకోర్టు ఉంటే ఇలానే ఉంటుందేమో..!!

ఆంధ్రాలో క‌రెంట్ బిల్లులు పెంచితే ఎవ‌రూ కోర్టుకు వెళ్ల‌లేదు.. ఎవ‌ర‌న్నా కోర్టుకు వెళ్లినా.. హైకోర్టు కూడా జోక్యం చేసుకోదు.. మ‌రి ఈ విష‌యంలో ఎందుకు జోక్యం చేసుకున్న‌ట్లు.. ఉమ్మ‌డి హైకోర్టు ఉంటే ఇలానే ఉంటుందేమో..!!

మొక్కులు చెల్లించడం అన్నీ నిజాం చేసిన ప‌నులే క‌దా...

కేసీఆర్ న‌యా నిజాం...మావోయిస్టులు(వాళ్లు అన్నారో లేదో కానీ రాధాకృష్ణ ప‌త్రిక అంటోంది)
అవున‌వును.. బ‌తుక‌మ్మ‌ను అధికారికంగా జ‌రిపించ‌డం, వివిధ కుల‌స్తుల‌కు భ‌వ‌నాలు క‌ట్టించ‌డం, హిందూ దేవాల‌యాల‌కు మొక్కులు చెల్లించడం అన్నీ నిజాం చేసిన ప‌నులే క‌దా...

ఏ నిర్ణ‌యం తీసుకున్నా మా అనుమ‌తి ఉండాల్సిందే..ఇదీ వారి తీరు..

ఆంధ్రా విద్యార్థులకు ఫీజులు క‌ట్టాలి..
ఆంధ్రా వాహ‌నాల‌కు ప‌న్నులు వేయొద్దు..
కృష్ణా, గోదావ‌రిలో నీటిలో మ‌న వాటా వాడుకోవ‌ద్దు..
శ్రీ‌శైలంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి చేయొద్దు..
స‌మ‌గ్ర స‌ర్వేలు వ‌ద్దే వ‌ద్దు...
వాట‌ర్ గ్రిడ్‌లు చేప‌ట్టొద్దు...
జీహెచ్ఎంసీలో ప‌న్నులు వ‌సూలు చేయొద్దు..
హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న చేయొద్దు...
*************
ఇది సీమాంధ్ర మీడియా డిమాండ్‌... దీనికి కొంద‌రు తెలంగాణ నేత‌ల మ‌ద్ద‌తు.. !!

లాభ‌న‌ష్టాలు ఎలా ఉంటాయ‌ని బేరీజు వేసుకుంటుంద‌ట‌..

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌న్ను వేస్తే ఆంధ్రా ప్ర‌భుత్వం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ట‌...
మ‌న‌మూ వేద్దామా?  అని ఆలోచిస్తుంద‌టా...
ఒక‌వేళ మ‌న‌మూ వేస్తే లాభ‌న‌ష్టాలు ఎలా ఉంటాయ‌ని బేరీజు వేసుకుంటుంద‌ట‌..
ఒక‌వేళ ఆంధ్రా కూడా ప‌న్నులు వేస్తే లాభం ఉంటుంద‌ని తేలితే వేసేయ‌డం ఖాయ‌మే..!

పాలెం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కేసును హైకోర్టు తిర‌గ‌దోడితే బాగుంటుందేమో...

తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన ప‌న్నుపై ప్రైవేటు బ‌స్సుల సంఘం హైకోర్టుకు వెళ్లిందట‌..
మ‌రి గా పాలెం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కేసును హైకోర్టు తిర‌గ‌దోడితే బాగుంటుందేమో...
ఆ బ‌స్సు ప్ర‌మాదంలో ఎంత మందిపై కేసు పెట్టారు.. ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నారో అడిగితే బాగుంటుందేమో..!
నోట్‌:  ఫాస్టు ప‌థ‌కంపైలాగే ఈ వ్య‌వ‌హారంలోనూ హైకోర్టు జోక్యం చేసుకుంటే మ‌న‌కు క‌ష్ట‌మే..