1

1

Wednesday 10 June 2015

ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు..

   
ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు.. వారంతా ఇక్క‌డ కాంట్రాక్టులు చేసుకొని డ‌బ్బులు కూడ‌బెట్టుకుని అదే సొమ్ముతో ఇక్క‌డి పాల‌న‌ను అస్త‌వ్య‌స్తం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.. వీలైతే తెలంగాణ‌లో పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌యారు చేయండి... ప్ర‌భుత్వం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు చేయూతనివ్వాల్సిందే... ఆంధ్రా ప్రాజెక్టుల్లో క‌నీసం ఒక్క తెలంగాణ పారిశ్రామిక‌వేత్త‌కైనా అవ‌కాశం ద‌క్కిందో చూడండి.. అలాంట‌ప్పుడు ఇక్క‌డి ప్రాజెక్టుల్లో ఆంధ్రా వ్యాపార‌వేత్త‌ల‌కు(ముఖ్యంగా రాజ‌కీయాలతో సంబంధం ఉన్న‌) పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చి వారిని ఆర్థికంగా మ‌రింత బ‌ల‌వంతుల‌ను చేయ‌డం అంటే మ‌న‌కు మ‌న‌మే చేటు చేసుకోవ‌డ‌మే...
మ‌న కాంట్రాక్ట‌ర్ల‌కు అర్హ‌త‌లు, అనుభ‌వం లేద‌ని కొన్ని ప్రాజెక్టుల్లో వారిని అన‌ర్హులుగా ప‌క్క‌న పెడుతున్నారు.. మ‌రి తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఎలాంటి పాల‌న అనుభ‌వం లేదు... అయినా ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టారు.. ఎందుకంటే మ‌నోడికి అనుభ‌వం లేక‌పోయినా మ‌న‌ల్ని అర్థం చేసుకుని పాలించే మ‌న‌సుంటుంద‌న్న న‌మ్మ‌కంతో.. మ‌న కోస‌మే ప‌నిచేస్తాడ‌న్న చిన్న స్వార్థంతో.. అనుభ‌వం, రాజ‌కీయ అర్హ‌త‌లు అన్నీ చూసుకుంటూ ఓటేసి ఉంటే మ‌ళ్లా కాంగ్రెస్‌కే అధికారం క‌ట్ట‌బెట్టే వారు క‌దా... !!
ప్ర‌జ‌లు ఆలోచించిన విధంగానే తెలంగాణ పాల‌కులూ ఆలోచించాలి.. తెలంగాణలో వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్ట‌ర్ల‌ను త‌యారు చేయాలి.. ఇందులోనూ సామాజిక న్యాయం పాటిస్తే అది మ‌రీ మంచిది.. !!

No comments:

Post a Comment