1

1

Wednesday 1 October 2014

ఒక‌వేళ ట్యాంక్ బండ్ విగ్ర‌హాల గురించి కేసీఆర్ మాట్లాడ‌కుండా ఉంటే..?

ట్యాంక్ బండ్‌పై ప‌నికి రాని విగ్ర‌హాల‌ను తొల‌గిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టిస్తే గానీ.. ఆంధ్రాలో తెలంగాణ మ‌హ‌నీయుల విగ్ర‌హాలు పెడ‌తామ‌న్న మాట రాలేదంటే వీళ్ల‌ను ఏమ‌నాలి.. ఒక‌వేళ ట్యాంక్ బండ్ విగ్ర‌హాల గురించి కేసీఆర్ మాట్లాడ‌కుండా ఉంటే ఆంధ్రాలో తెలంగాణ మ‌హ‌నీయుల విగ్ర‌హాలు పెడ‌తామ‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చేదా?
వీళ్ల వంచ‌న మాట‌ల‌ను మ‌నం న‌మ్మొచ్చా? మ‌ళ్లీ వంచ‌న‌కు గురైతే త‌ప్పు మ‌న‌దే కాదా?

3 comments:

  1. పనికిమాలిన విగ్రహాలట! పెద్దల నా విధంగానేనా దూషిచటం? భగవంతుడు కాలస్వరూపుడు. ఈ అవినయానికి ఫలితం తప్పక ప్రసాదిస్తాడు సుమా!

    పనికిమాలినవారు పనిబడి యన్న
    పనికిమాలినమాట పనిగొని తలచు
    పనికిమాలినవారి పాడుబుధ్ధులకు
    పనికిమాలినవారి వలె దోచి నంత
    పనికిమాలినవారె బయటి వారనెడు
    పనికిమాలిన బుధ్ధిభ్రష్టత్వరోగ
    మునజేసి యౌచిత్యమును తెగగోసి
    స్వర్గస్థులైయున్న సత్పూరుషులను
    దోషమెంచక మీరు దూషించినంత
    వారి ఘనతల కేల వాటిల్లు దొసగు
    వారి నామము లేల వాయును కీర్తి
    వారి చెయ్వుల కేల వచ్చును మచ్చ
    వారి మాటల మంచి వసివాడి పోదు
    వారి మాటలు దబ్బరలు గాబోవు
    వారి దార్శనికత వట్టిది కాదు
    వారి దారులు మూతబడి చెడిపోవు
    వారిని కాదని వాగినంతటనె
    వారిస్ఫూర్తికి లోటు వచ్చుట కల్ల
    వారిని పడతిట్టి పండ్లికిలించ
    వారికి వచ్చెడు బాధయు లేదు
    వారి విగ్రహములు పగుల నేయగనె
    వారి జ్ఞాపకములు వాడిపోబోవు
    వారిని కాదను పామరులైన
    వారిని కాలమే పట్టి గ్రసించు
    అన్నోదకంబుల కట్టివారల
    కన్నివిధంబుల నగచాట్లు గలగు
    దుమ్మైన పిదప నా తుళువల గూర్చి
    యిమ్మహి దలచబో రెవ్వరు గాని

    తథాస్తు.

    ReplyDelete
  2. కె.సి.ఆర్. నంది అంటే చంద్రబాబు పంది అనడానికి సిద్ధపడినట్టే ఉంది.

    ReplyDelete
  3. సార్‌.. వాటిని ప‌నికి మాలిన విగ్ర‌హాలు అని అన‌డం లేదు... తెలంగాణ‌కు అక్క‌ర‌కు లేని విగ్ర‌హాల‌ని మాత్ర‌మే అన్నారు... మ‌న‌కు అక్క‌ర‌కు రాని విగ్ర‌హాలు చాలా ఉన్నాయి.. వాటి స్థానంలో తెలంగాణ మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌ను పెడ‌తామ‌ని మాత్ర‌మే కేసీఆర్ అన్నారు..

    ReplyDelete